మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యం...
భద్రాచలం, పినపాక నియోజకవర్గానికి అదనంగా 1500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు...
ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..
నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బూర్గంపాడు మార్కెట్ కమిటీలో, భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని గిరిజన భవన్లో ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలను ఘనంగా నిర్వహించారు. భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి పాల్గొన్నారు. సభ ప్రాంగణాని కి విచ్చేసిన మంత్రికి మహిళలు ఘనంగా స్వాగతం పలిచారు. అనంతరం మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని మహిళా స్వయం శక్తి సంఘాల ద్వారా చేపడుతున్న పనులు, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కల్పిస్తున్న ప్రగతి నివేదికలను వివరించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో మహిళల సాధికారత కోసం ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. వడ్డీ లేని రుణాలు, మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బీమా భద్రత పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సబ్సిడీ బియ్యం వంటి పథకాలు నిజమైన సంక్షేమ పాలనకు నిదర్శనమని ఆయన వివరించారు.
గత పాలనలో చెల్లించని 3750 కోట్ల పావల వడ్డీ బకాయిలు చెల్లించలేదని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఎర్పడిన తర్వాత 865 కోట్లు మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేశామని మంత్రి చెప్పారు. అంతేకాక, మహిళా సభ్యుల బీమా పథకాన్ని పునరుద్ధరించి, సహజ మరణానికి 2 లక్షలు, ప్రమాద మరణానికి 10 లక్షల బీమా కల్పించినట్లు వివరించారు.
గత పాలనలో 18 నుండి 60 ఏళ్ల వయస్సు మహిళలకే స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వం ఉండేది. ఇప్పుడు 15 నుండి 65 ఏళ్ల వయస్సు గల మహిళలకు సభ్యత్వ అవకాశాన్ని కల్పించడం ద్వారా లక్షలాది మంది లబ్ధిపొందుతారని అన్నారు.
పేదలకు ఇళ్ల నిర్మాణం ప్రధాన లక్ష్యంగా తీసుకున్న ప్రభుత్వం, తొలి దశలో అశ్వరావుపేట నియోజకవర్గానికి 4,500 ఇళ్లను మంజూరు చేసింది. అలాగే, భద్రాచలం నియోజకవర్గానికి అదనంగా 1500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. రాబోయే మూడున్నర సంవత్సరాల్లో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. మహిళల అభివృద్ధికి దోహదపడేలా వెయ్యి సోలార్ యూనిట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా సంఘాల పేరుపై బస్సుల కొనుగోలు వంటి ఆవిష్కరణాత్మక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులే ఇవ్వలేకపోయిందని, నేటి ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రం రేషన్ కార్డుతో పాటు, ఆరోగ్యానికి హానికరమైన దొడ్డు బియ్యం స్థానంలో పోషక విలువలతో కూడిన సన్నబియ్యాన్ని అందించుతోందని మంత్రి అన్నారు. గిరిజన ప్రాంతాల్లో తాటాకు ఇళ్లను ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రతి గూడెంకు విడతలవారీగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో పేదల కష్టాలను తీర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ..
మహిళా సంఘాల ద్వారా భద్రాచలo ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిందన్నారు. భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని 390 మహిళ సమాఖ్య సంఘాల ద్వారా సుమారు 40000 మంది మహిళలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మహిళా శక్తి ద్వారా సమాజాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళల ద్వారా ఆర్టీసీ బస్సుల నిర్వహణ, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు వంటి సంక్షేమ పథకాలు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చెందెందుకు ఉపయోగపడుతున్నాయి అన్నారు. భద్రాచలంలోని గిరిజన మహిళలు తయారు చేసే రాగి మాల్ట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది అన్నారు. ఇందిర మహిళా శక్తి సంఘాల ద్వారా ఆహార పదార్థాలు తయారీతో భద్రాచలం నియోజకవర్గం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు.
*జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ.
భద్రాచలం నియోజకవర్గం లోని మహిళలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కలెక్టర్ అన్నారు. ఈ ప్రాంత మహిళలు తయారు చేసే ఆహార పదార్థాలు దేశంలోని ఇతర ప్రాంతాల మహిళలకు ఆదర్శప్రాయం అన్నారు.ప్రభుత్వం నేడు మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రేషన్ కార్డుల మంజూరు, ఆర్థిక సహాయ పథకాలు, స్వయం ఉపాధి అవకాశాలు వంటి వాటి ద్వారా ఇంట్లో ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతోంది అన్నారు.
*ఐటీడీఏ పీవో రాహుల్ మాట్లాడుతూ..
ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగపరచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మహిళల పేరు మీదే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, రేషన్ కార్డులు, వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సులు నిర్వహణ, 500 కే గ్యాస్ బండ వంటి అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందని వాటిని ఉపయోగించుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని ఆయన అన్నారు.
పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..
మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు.
అనంతరం భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని 268 స్వయం సహాయక సంఘాలకు 17.64 కోట్లు, బ్యాంకు లింకేజీ ద్వారా 268 స్వయం సహాయక సంఘాలకు 17.64 కోట్లు మరియు లోన్ బీమా ద్వారా 17 మంది సభ్యులకు 22 లక్షల 49 వేల 230 రూపాయలు, లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కోపరేటివ్ డైరెక్టర్ బ్రహ్మయ్య, సిపిఐ రాష్ట్ర నాయకుడు అయోధ్య, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డి ఎస్ఓ రుక్మిణి, భద్రాచలం తాసిల్దార్ వెంకటేశ్వర్లు, మణుగూరు తాసిల్దార్ అద్దంకి నరేష్, పినపాక తాసిల్దార్ గొంది గోపాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సమైక్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
About The Author

Vande Bharat Network – Print & Electronic Media
(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")
Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

