నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు’ ‘ఓపెన్ సోర్స్ జి ఐ ఎస్ కోహార్ట్ అవార్డు’ రెండు అవార్డులు అందుకున్న....

నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు’ ‘ఓపెన్ సోర్స్ జి ఐ ఎస్ కోహార్ట్ అవార్డు’ రెండు అవార్డులు అందుకున్న....

 


 భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి. పాటిల్


నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగానికి ప్రతినిధిగా, జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్, ఐఐటి బాంబేలో నిర్వహించిన ‘ఓపెన్ సోర్స్ జిఐఎస్ డే’లో ‘నేషనల్ జియోస్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు’ *ఓపెన్ సోర్స్ జిఐఎస్ కోహార్ట్ అవార్డు’ లను అందుకున్నారు. ఈ అవార్డులను ఐ ఎస్ ఆర్ ఓ మాజీ చైర్మన్ శ్రీ ఏ.ఎస్. కిరణ్ కుమార్  ప్రదానం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామీణ సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుని, జియోస్పేషియల్ టెక్నాలజీ నిపుణులతో కలిసి భారతదేశంలో నిర్వహించిన మొట్టమొదటి ‘ఓపెన్ సోర్స్ జిఐఎస్ సదస్సు’ నిర్వహణకు గాను, అలాగే జిల్లాలోని వివిధ సమస్యలకు సంబంధించి ఓపెన్ సోర్స్ జియోస్పేషియల్ టెక్నాలజీ ద్వారా జిల్లా విద్యార్థులు, అధికారులు భాగస్వాములుగా పాల్గొని, మన జిల్లా సమస్యలను లోకల్ స్థాయిలో పరిష్కరించే విధంగా కృషి చేసినందుకు ఈ రెండు అవార్డులు లభించాయి. జిల్లా స్థాయిలో జిఐఎస్ ఆధారిత వ్యవస్థలను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి, గ్రామీణ సమస్యల పరిష్కారంలో జియోస్పేషియల్ టెక్నాలజీ వినియోగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పినందుకు ఈ గుర్తింపు లభించింది. గోదావరి వరదల సమయంలో ఫ్లడ్ ప్రిడిక్షన్, గ్రామీణ స్థాయిలో జిఐఎస్ స్కిల్లింగ్, విభిన్న శాఖల డేటాను భౌగోళిక సమాచారంతో అనుసంధానం చేసి నిర్ణయాలు తీసుకునే విధానాలను జిల్లా యంత్రాంగం ముందుండి అమలు చేసింది. భారతదేశంలో మొట్టమొదటి "ఓపెన్ సోర్స్ జిఐఎస్ కోహార్ట్" ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసి, ఐఐటి బాంబే ఫాసి జిఐఎస్ సహకారంతో క్యూ జి ఐ ఎస్ వినియోగాన్ని గ్రామీణ సమస్యల పరిష్కారానికి ప్రాక్టికల్‌గా నేర్పడంలో జిల్లా నేతృత్వం వహించింది. గోదావరి వరదల ముందు ముంపు గ్రామాల గుర్తింపు, పి హెచ్ సి పరిధిలో విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణ, పత్తి రైతులను మునగ సాగు వైపు మారుస్తూ రైతులను స్వయం సమృద్ధి వైపు నడిపించే ప్రయత్నాలు జిల్లాలో కొనసాగుతున్నాయి.

 అవార్డు అందుకున్న సందర్భంలో కలెక్టర్  మాట్లాడుతూ* :

“భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భౌగోళికంగా తెలంగాణలో అతిపెద్ద జిల్లా, 37% గిరిజన జనాభాతో విస్తరించిన జిల్లా. గిరిజనుల విలువైన సంస్కృతి కలిసికట్టుగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లే మార్గాన్ని చూపిస్తోంది. జిఐఎస్ సాయంతో పత్తి, మొక్కజొన్న పొలాలను మ్యాప్ చేసి, రైతులను మునగ సాగు వైపు మళ్లించే ప్రయత్నం మొదలుపెట్టాము. ఇది రైతులను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మార్చడానికి దోహదపడుతోంది. అలాగే, మేకల పెంపకం, మేకపాల ఉత్పత్తి పెంపుదలపై జిఐఎస్ ఆధారంగా పరిశీలనలు జరుగుతున్నాయి. ఈ వేదిక ద్వారా ఐఐటి బాంబే సాంకేతిక పరిజ్ఞానాన్ని జిల్లాకు తీసుకువచ్చి, రైతులు, విద్యార్థులు, అధికారులు అందరికీ ఉపయోగపడేలా చేస్తున్నాము. విద్యార్థులు ఐఐటి బాంబే సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం, పట్టణాభివృద్ధి, కమ్యూనికేషన్ విస్తరణలో దృష్టి పెట్టి ఉత్పాదకతను పెంచి జిల్లాకు ఆర్థిక వృద్ధిని తీసుకురాగలరని నమ్మకం ఉంది. ఈ సందర్భంలో ఐఐటి బాంబే నిపుణులు, శాస్త్రవేత్తలు, వివిధ సంస్థలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆహ్వానిస్తున్నాను. అన్ని విభాగాలను అనుసంధానించి అభివృద్ధి దిశగా కలిసి పనిచేయాలని కోరినారు.

జిల్లాకు గర్వకారణం:

ఈ రెండు అవార్డులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులందరికీ గర్వకారణమని, జి ఐ ఎస్ ఆధారిత కార్యక్రమంలో కృషి చేసిన హెచ్ పి హెచ్ ఎఫ్ బృందానికి, అస్పిరేషనల్ బ్లాక్ ఫెలో నవనీత్ జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్, అభినందనలు తెలిపారు.

*జిల్లా అభివృద్ధి దిశగా జిఐఎస్ జిఐఎస్ ఆధారిత వ్యవస్థలను మరింత సమర్థవంతంగా విస్తరించేందుకు, ప్రజల అవసరాలకు అనుగుణంగా వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉంటుంది” అని పేర్కొన్నారూ. విద్యాశాఖ, భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నేషనల్ జియోస్పేషియల్ అవార్డ్స్ 2025 (ఎడిషన్ 02)’ లో ఈ రెండు అవార్డులు లభించాయి. ఇవి ‘నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022’ మరియు ‘ఇండియన్ స్పేస్ పాలసీ 2023’ కు అనుగుణంగా జియోస్పేషియల్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి గుర్తింపుగా నిలుస్తాయి

Views: 1

About The Author

NAMASTHEBHARAT Picture

Vande Bharat Network – Print & Electronic Media

(Publishers of "Namasthe Bharat" & "Nyaya Mithra News")

Vande Bharat Network is a dynamic and responsible media organization dedicated to upholding truth, justice, and public awareness. Through its esteemed publications—"Namasthe Bharat" and "Nyaya Mithra News"—the network provides comprehensive coverage of current affairs, politics, governance, public policies, and socio-economic issues at the state, national, and international levels

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వనదుర్గామాతను దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  రామచందర్ రావు   వనదుర్గామాతను దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  రామచందర్ రావు  
                                  మెదక్,జూలై18(నమస్తే భారత్):ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీఏడుపాయల వనదుర్గామాతను శుక్రవారం రోజు ఇటీవల నూతనంగా ఎన్నికైన బీజేపీ రాష్ట్ర   అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు,మెదక్ ఎంపీ రఘునందన్ రావు,ఎమ్మెల్సీ
అత్తాపూర్ పాఠశాలలో వెరీజాన్ సహకారంతో  స్టెమ్ ల్యాబ్‌లో అవగాహన కార్యక్రమం 
శ్రీ శ్రీ శ్రీ బంగారు పోచమ్మ దేవాలయానికి మంగలారం శ్రీనివాస్ దంపతుల విరాళం 
శేరిలింగంపల్లి ప్రాజెక్టులో అంగన్‌వాడీల ధర్నా: సమస్యల పరిష్కారానికి సీడీపీవోకు వినతి 
ప్రజా రోగ్యం కోసం నిబద్దత తో పని చేస్తున్న వైద్యులకు ఎప్పటికి గుర్తింవు ఉంటుంది 
ప్రజా రోగ్యం కోసం నిబద్దత తో పని చేస్తున్న వైద్యులకు ఎప్పటికి గుర్తింవు ఉంటుంది 
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యం...