జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించాలి : ఎంపీ కేశ్రీదేవ్ సిన్హ్ ఝాలా
On
రామగిరి, నవంబర్ 12 : జాతిని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిదని, ప్రజల్లో జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించాలని రాజ్యసభ ఎంపీ కేశ్రీదేవ్ సిన్హ్ ఝాలా అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్, ఎన్ఎస్ఎస్ సహకారంతో బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్. జి.కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన “సర్దార్ @150 యూనిట్ మార్చ్” ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా పటేల్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో జాతి నిర్మాణంలో యువతను ప్రోత్సహించడం, యువత ఆలోచనలను ఆచరణలో పెట్టి దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Tags
Related Posts
Latest News
12 Nov 2025 18:06:39
రామగిరి, నవంబర్ 12 : జాతిని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిదని, ప్రజల్లో జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించాలని రాజ్యసభ ఎంపీ కేశ్రీదేవ్...
